Rahul Jodo Yatra: రాహుల్ జోడో యాత్ర.. కర్ణాటకలో జోరుగా..

Rahul Jodo Yatra: రాహుల్ జోడో యాత్ర.. కర్ణాటకలో జోరుగా..
Rahul Jodo Yatra: హసన్‌, తూముకూర్‌ జిల్లాల నుంచి భారీగా కాంగ్రెస్‌ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

Rahul Jodo Yatra: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో జోరుగా కొనసాగుతుంది. ఇవాళ భారత్‌ జోడో యాత్ర 33వ రోజుకు చేరుకుంది. తూముకూర్‌ జిల్లాలో రాహుల్‌ పాదయాత్ర కొనసాగుతుంది. రాహుల్‌గాంధీకి భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు స్థానికలు కార్యకర్తలు. హసన్‌, తూముకూర్‌ జిల్లాల నుంచి భారీగా కాంగ్రెస్‌ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రులు, కర్ణాటక పీసీసీ సభ్యులు జోడో యాత్రలో ఉత్సహాంగా పాల్గొంటున్నారు.

33వ రోజు రాహుల్ గాంధీ తూముకూర్‌లో పోచ్‌కట్టి నుంచి ఉదయం 6గంటల 30 నిమిషాలకు పాదయాత్ర మొదలైంది. రాహుల్‌ పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉదయం 10 గంటలకు బసవన గుడి దగ్గర స్థానికులతో సమావేశం కానున్నారు రాహుల్‌.. 11.30గంటలకు హిరియార్‌లోమార్నింగ్‌ బ్రేక్‌ ఇచ్చారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానికులతో సమావేశం అయ్యారు రాహుల్‌. స్థానికంగా ఉండే చిరు వ్యాపారులు రాహుల్‌తో మాట్లాడుతారు.

తిరిగి సాయంత్రం 4.00 గంటలకు హిరియార్‌ నుంచి పాదయాత్ర మొదలై హర్తికోటే గ్రామం వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు శ్రీ వీరాంజనేయ మఠం, కేదారేశ్వర సన్నిధిలో రాహుల్‌ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలోప్రసంగించనున్నారు రాహుల్‌. హర్తికోటే గ్రామం 33వ రోజు పాదయాత్ర ముగియనుంది. రాత్రికి అక్కడే రాహుల్‌ బస చేయనున్నారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పాల్గొననున్నన్నారు. కాంగ్రెస్‌నేతలు డీకే శివకుమార్‌, మాజీ మంత్రులు, తూముకూర్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు,పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story