గుజరాత్ 17వ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం..!

ఉత్కంఠకు తెరదించుతూ ఎట్టకేలకు... గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనతో ప్రమాణం చేయించారు. భూపేంద్ర పటేల్ గుజరాత్ 17వ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్రమంత్రులు అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుఖ్ మాండవీయా, ప్రహ్లాద్ జోషిలు హాజరయ్యారు. వీరితోపాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌లూ పాల్గొన్నారు. విజయ్ రూపాణీ రాజీనామా చేయడంతో భూపేంద్ర పటేల్‌ను భాజపా అధిష్ఠానం సీఎంగా నియమించింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు మాజీ సీఎం విజయ్ రూపాణీని ఆయన నివాసంలో భూపేంద్ర పటేల్ కలిశారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన అమిత్‌షాకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు అహ్మదాబాద్‌లోని స్వామి నారాయణ్ ఆలయంలో గో పూజ నిర్వహించారు. భూపేంద్ర పటేల్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ రూపానీ రాజీనామాతో మంత్రిమండలి కూడా రద్దయిపోయింది. సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం చేసినప్పటికీ ఇంకా క్యాబినెట్ కూర్పు మిగిలే ఉంది. మంత్రివర్గ సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం జరగనుంది. త్వరలోనే వారి ప్రమాణం ఉంటుందని సంబంధితవర్గాలు వెల్లడించాయి.
సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన భూపేంద్ర పటేల్ కి… ఆనందిబెన్ పటేల్ సన్నిహితుడిగా పేరుంది. పాటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్....అహ్మదాబాద్‌లోని మెమ్నాగర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com