బిగ్‌బాస్.. కనిపెట్టిన బాస్ ఎవరంటే..

మూడు నెలలపాటు ఆపకుండా ఎంటర్ టైన్మెంట్.. అదీ ఒకే ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులు.. అయిన వాళ్లతో సంబంధం లేకుండా.. అంతవరకూ చూడని వ్యక్తులతో కలహాలు పెట్టుకుంటూ, కలిసి ఉంటూ, ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఎలా ఉంటారో.. ఒక్కసారి హౌస్ లోకి ఎంటరైతే చాలా నేర్చుకోవచ్చు అనే వాళ్లూ ఉన్నారు.. ఇంతకీ ఈ ఐడియా ఎవరికి వచ్చింది.. బిగ్ బాస్ ఎక్కడ పుట్టింది.. తెలుసుకుందాం..
మొదట ఈ కాన్సెప్ట్ నెదర్లాండ్స్ లో రూపుదిద్దుకుంది. అక్కడ క్లిక్ అవడంతో దేశాలు దాటి ఎవరి భాషలో వాళ్లు బిగ్ బాస్ ని డిజైన్ చేసుకుంటున్నారు. షో మొదలు పెట్టిన అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, ఉత్తరాది ప్రజలు బిగ్‌బాస్ షోని ఆసక్తిగా తిలకిస్తుంటారు.. ఛానెల్ రేటింగ్స్ ని కూడా ఈ షో పెంచేసింది.
ఇక ఈ షో రూపకర్త డచ్ మీడియా కంపెనీ యజమాని అయిన జాన్ డి మోల్ జూనియర్. 1999లో తొలిసారి బిగ్ బ్రదర్ పేరుతో ఈ షోని నెదర్లాండ్స్ లో ప్రసారం చేశాడు. బిగ్ర బదర్ ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు అక్కడి బుల్లితెర ప్రేక్షకులు. ఈ ఐడియాని అమ్ముకుంటే కోట్లు కొల్లగొట్టచ్చనుకున్నాడు జాన్.. అనుకున్నదే తడవుగా కొన్ని దేశాలకు ఆఫర్ పెట్టాడు.. ఇప్పుడు 54 దేశాల్లో ఈ షో రన్నవుతోంది. నైంటీన్ ఎయిటీ ఫోర్ అనే నవల నుంచి బిగ్ బ్రదర్ అనే పేరును ఎంపిక చేసుకున్నాడు.. ఆ తరువాత అది బిగ్ బాస్ గా మారింది.
మన దేశంలో బిగ్‌బాస్ కి ఇంతటి ఆదరణ లభించడానికి కారణం మాత్రం శిల్సాశెట్టీనే. 2007లో బ్రిటీష్ బిగ్ బ్రదర్ లో పాల్టొని విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు తెల్లజాతీయులు శిల్పపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర స్థాయిలో దుమారం జరిగింది. శిల్సను తిట్టిన వారిపై 44,500 కేసులు, షోను ప్రసారం చేసిన టీవీ ఛానెల్ పై 3వేల కేసులు నమోదయ్యాయి. హిందీలో హిట్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లోకీ అడుగుపెట్టింది బిగ్‌బాస్.
2017 జూలై 16 జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ షోని నడిపించి క్లిక్ చేశారు. హౌన్ మేట్స్ ని 24 గంటలు గమనించేందుకు రోజుకి 250 మంది పనిచేస్తుంటారు. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చా సుదీప్ ఈ షోకి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో హౌస్ మేట్ ఒకరు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆ తరువాత అది సద్దు మణిగినా వ్యాఖ్యాత కమల్ విమర్శలను ఎదుర్కుంటూనే ఉంటారు.
హిందీలో మాత్రం బిగ్‌బాస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ 14వ సీజన్ కు చేరుకుంది. హిందీ వెర్షన్ కి మొదట చాలా మంది హోస్ట్ లుగా వ్యవహరించినా సల్మాన్ ఖాన్ కి వచ్చినంత పేరు మరెవరీ రాలేదు. ఆఖరికి అమితాబ్ బచ్చన్ కి కూడా. తెలుగులో బిగ్ బాస్ వాయిస్ ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.. ఆ వాయిస్ ఎవరిదో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉండేది.. అది రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ది అని చాలా రోజులకు కానీ తెలియలేదు. ఆయన చాలా సీరియల్స్ కు, సినిమాలకు డబ్బింగ్ చెబుతుంటారు. మాటీవీలో ప్రసారమయ్యే CID కి కూడా ఆయనే డబ్బింగ్ చెబుతుంటారు. ఖంగు మని మోగే ఆ వాయిస్ కి హౌస్ మేట్స్ కూడా ఫిదా అయిపోతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com