అంతలేదు.. హారిక నా చెల్లి: అభిజీత్

అంతలేదు.. హారిక నా చెల్లి: అభిజీత్
ఇక అభిజీత్ విషయానికి వస్తే హారిక‌ను హగ్ చేసుకోవడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఏదో ఊహించుకున్నారు.

వంద రోజులు ఒకే ఇంట్లో ఉండడం.. నిజానికి అదే పెద్ద టాస్క్. మరి టైం పాస్‌కి ఇంకో వస్తువు ఏదీ ఉండదు.. ఇంట్లో ఉన్న వాళ్లతోనే ప్రేమైనా, గొడవైనా.. వారిపైనే ఎక్కువగా ఫోకస్ అవుతుంది బిగ్‌బాస్ కెమెరా. అలా హౌస్‌లో బాగా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసిన జంటలు అఖిల్-మోనాల్, అరియానా-అవినాష్, అభిజీత్-హారికలు.. హౌస్‌లోకి వెళ్లిన తొలి రోజుల్లో అభిజీత్ మోనాల్‌పై మనసు పారేసుకున్నా అఖిల్‌తో కూడా ఉంటోందని తెలిసి ఆమెను పక్కన పెట్టాడు తెలివైన అభిజిత్.

ఇక అవినాష్-అరియానాలది ప్రేమో, ఎఫెక్షనో అర్ధం కాకుండా మెయింటైన్ చేశారు ఇద్దరూ.. వాళ్లిద్దరినీ మంచి ఫ్రెండ్స్‌గా కూడా చూడొచ్చు. ఇక అభిజీత్ విషయానికి వస్తే హారిక‌ను హగ్ చేసుకోవడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఏదో ఊహించుకున్నారు. కానీ బిగ్‌బాస్ విన్నరై బయటకొచ్చిన అభిజీత్ వివిధ ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఏంటి సంగతి.. మీ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందా అని ప్రశ్నిస్తే.. ఛా ఛా అలాంటిదేం లేదు బాస్.. నాకు ఓ తమ్ముడు ఉన్నాడు.. హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బావుంటుందనుకునే వాడిని. అదే విషయాన్ని హారికతో హౌస్‌లో చాలా సార్లు చెప్పాను.. కానీ స్క్రీన్ మీద వాటిని చూపించలేదు.. దాంతో మీరంతా ఇలా ఊహించుకుని ఉంటారు అని హారికతో ఉన్న రిలేషన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు అభిజీత్.

అయితే వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఇరువురి పేరెంట్స్ ‌కూడ అనుకున్నారు. అభిజీత్ ఒప్పుకుంటే ఇద్దరికీ పెళ్లి చేస్తామని హారిక మదర్ ఫిక్సయిపోయారు.. ఒకానొక సందర్భంలో అదే మాట ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక అభి వాళ్ల మదర్ కూడా హారిక లాంటి అమ్మాయి కోడలుగా రావాలనుకున్నారు. బిగ్‌బాస్ రేటింగ్ కోసమే వాళ్ల రిలేషన్‌ని తప్పుగా చూపించిందేమో అని ఇప్పుడు ప్రేక్షకులు అనుకోవాల్సి వస్తుంది.

Tags

Next Story