కంటెస్టెంట్లను ఏడిపించిన బిగ్‌బాస్.. అవినాష్ కిందపడిపోవడంతో..

ఆకర్షణీయంగా మలచిన బిగ్‌బాస్ షో ఆసక్తిగా సాగుతోంది. కంటెస్టెంట్లలో సీరియస్ నెస్‌ని క్రియేట్ చేస్తున్నారు. గేమ్ పైనే ఫోకస్ చేస్తున్నారు ఇంటి సభ్యులు. కష్టమైనా టాస్క్‌లను బాధపడుతూనే బాగా చేసేస్తున్నారు. వాళ్ల చిన్న నాటి ఫోటోలు చూపించి ఆనాటి మధుర జ్ఞాపకలను గుర్తు చేసుకుని ఇంటి సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో స్టోరి.. అన్ని కష్టాలను దాటుకుంటూ ఎదిగిన తీరుని వివరించారు. ప్రేక్షకుల చేత కూడా కన్నీళ్లు పెట్టించారు. హౌస్‌లో నెలకొన్న ఈ ఉద్విగ్న వాతావరణం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చారు ఇంటి సభ్యులకు. దీనికి అభిజిత్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా ఎన్నో గండాలను దాటుకుని బైక్ రేసింగ్ చేయాలి.
ఈ క్రమంలో అఖిల్, మెహబూబ్, సోహైల్, కుమార్ సాయి ఈ కష్టమైన టాస్క్‌ని పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. అఖిల్ టాస్క్ మొదలు పెట్టగానే అక్కడ రిస్క్ ఎక్కువగా ఉందని మోనాల్ కంగారు పడుతోంది. జాగ్రత్త అంటూ అతడికి బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేసింది. మరో వైపు అవినాష్ టాస్క్ పూర్తి చేసేందుకు నానా కష్టాలు పడుతున్నాడు. ఒకానొక సమయంలో ధబ్ మని కిందపడడంతో ఇంటి సభ్యులు షాకయ్యారు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు అనేది ఈ రోజు ఎపిసోడ్‌లో తేలుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com