నాగార్జున పంపించిన గిప్ట్ చూసి.. అవినాష్ ఆనందం

నాగార్జున పంపించిన గిప్ట్ చూసి.. అవినాష్ ఆనందం
వచ్చిన పార్సిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న గిప్ట్‌ని చూసి ఆశ్చర్యపోయాడు.. థ్యాంక్యూ సార్.. గుర్తుపెట్టుకుని

అవినాష్ హౌస్ ‌లోకి వచ్చి ఆడియన్స్‌తో పాటు ఇంటి సభ్యులనూ నవ్వించాడు. అదే సమయంలో కన్నీళ్లూ పెట్టించాడు. ఒకానొక సందర్భంలో అసలు అవినాష్ కామెడీ యాక్టరేనా అన్న అనుమానమూ ప్రేక్షకులకు కలగజేశాడు.. మొత్తానికి వెళుతూ వెళుతూ అందర్నీ నవ్వించే వెళ్లాడు.. మంచి ఇమేజ్‌ని సంపాదించుకుని బయటకు వచ్చాడు. ఎలిమినేట్ అయిన అవినాష్‌కి నాగ్ ఓ సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇంటికి పంపించారు.

వచ్చిన పార్సిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న గిప్ట్‌ని చూసి ఆశ్చర్యపోయాడు.. థ్యాంక్యూ సార్.. గుర్తుపెట్టుకుని పంపించినందుకు అని సోషల్ మీడియాలో ఆ ఫోటోని పోస్ట్ చేశాడు. ఇంతకీ ఏంటా బహుమతి అంటే.. ఓసారి వీకెండ్‌లో నాగార్జున వేసుకొచ్చిన షర్ట్ చూసి బావుంది సార్ అన్నాడు. అంతే.. అవినాష్ ఇంటికి ఆ షర్ట్ వచ్చేసింది. ఆ షర్ట్ వేసుకుని ఫోటో దిగి ముచ్చటపడుతున్న ఫోటో పోస్ట్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story