బిగ్‌బాస్ హౌస్.. ఎమోషన్‌కు గురి చేసిన.. యాంకర్ దేవి ఎలిమినేషన్

ప్రశ్నించిన గొంతును నొక్కేయడం ఎక్కడైనా జరిగేదే.. ఇక్కడ కూడా జరిగిందేమో అనిపించేలా సాగింది యాంకర్ దేవి ఎలిమినేట్ కావడం.. ఆమె హౌస్ నుంచి నిష్క్రమణ తోటి హౌస్‌మెట్స్‌తో పాటు ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చాయి. దేవి ఉన్నది కొద్ది రోజులైనా హౌస్‌మెట్స్ నుంచి మంచి పేరు సంపాదించుకుంది. తను తనలానే ఉండి గేమ్ ఆడింది. ఇక్కడకు వచ్చిన తరువాత అందరూ ఒకటే.. ఎవరూ ఎక్కువా కాదు తక్కువా కాదు అని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది.
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ల్‌లో భాగంగానే తనకు నచ్చని వ్యక్తులను మెడపట్టి గెంటింది తప్ప అది వ్యక్తిగతం కాకపోయినా సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోయాడు.. ఆమెకి ఓట్లు తక్కువగా పోలయ్యాయి. కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి హౌస్‌మెట్స్ ఎవరూ తన గురించి పాజిటివ్‌గా చెప్పిన సందర్భాలు లేవు. అయినా అతడిని ప్రేక్షకులు గెలిపించారు. బిగ్‌బాసూ గెలిపించాడు.
సీరియస్‌గా ఆడింది.. సిన్సియర్‌గా ఉంది. తన లిమిట్స్‌ని ఎప్పుడూ క్రాస్ చేయని దేవి ఎందుకు ఎలిమినేట్ అయిందో ఎవరికీ అర్ధం కాలేదు. ఆఖరికి తనకి కూడా అర్థం కాలేదు.. అదే అభిప్రాయాన్ని హోస్ట్ నాగార్జున అడిగితే చెప్పింది. వెళుతూ ఆమె ఒక్కో హౌస్‌మేట్ గురించి చెప్పిన మాటలు ప్రేక్షకులతో పాటు నాగార్జునకూ నచ్చాయి. అదే విషయాన్ని దేవికి చెబుతూ ఆమెని ప్రశంసించారు. హౌస్‌నుంచి నిష్క్రమిస్తూ దేవి ఓ చక్కని పాట పాడి ప్రేక్షకులను, హౌస్‌మేట్స్‌ను కంటతడి పెట్టించింది. మిగిలిన హౌస్‌మెట్స్‌కి గట్టి పోటీ ఇచ్చి చివరి వరకు నిలుస్తుందనుకున్న దేవి ఇలా వెళ్లిపోవడం ఊహించని పరిణామం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com