Bihar : కలగంటున్న వీడియోను షేర్ చేసిన బీహార్ మంత్రి

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. తాను శ్రీకృష్టున్ని కలలో చూశానని తెలిపారు. అందుకుగాను ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. తేజ్ ప్రతాప్ శ్రీకృష్ణుడిని, మహాభారత యుద్దం గురించి కలలు కంటున్న వీడియోను పంచుకున్నారు. ఓ వీడియోను షేర్ చేస్తూ కలలో తాను.. మెరిసే చక్రాలతో అలంకరించబడిన కిరీటంతో, గధతో, ఆయుధాలతో విశ్వాన్ని నిండి ఉండిన శ్రీకృష్ణున్ని తాను చూసినట్లు తెలిపారు. అందుకు గాను హిందీలో తీసిన మహాభారత్ సిరీస్ నుంచి ఓ వీడియోను ట్వీట్ చేశారు. వీడియోలో తేజ్ ప్రతాప్ బెడ్ పై నిద్రపోతున్నట్లు కనిపిస్తారు. అతను మహాభారత యుద్దాన్ని కలగన్నాక షాక్ తో మేల్కొంటాడు.
తేజ్ ప్రతాప్ ఇదివరకు కూడా ములాయం సింగ్ యాదవ్ ను కలలో చూసినట్లు ప్రకటించారు. గతంలో శ్రీ కృష్ణుని వేషధారణలో తనను తాను దేవుడితో పోల్చుకున్న విషయం తెలిసిందే. పాట్నాలోని శివాలయానికి పూజలు చేయడానికి శివుడిలా అలంకరించుకుని వెళ్లారు. తాజాగా శ్రీకృష్ణున్ని మహాభారతాన్ని చూసినట్లు చెప్పారు.
https://twitter.com/i/status/1638631917804466187
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com