బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న బీహార్ ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. శుక్రవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్ ఆరోరా ఈ వివరాలను తెలిపారు. అక్టోబర్ 28న తొలివిడత, నవంబర్ 3న రెండవ విడత, నవంబర్ 7న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు. ఫలితాలను నవంబర్ 10 వెల్లడిస్తామని అన్నారు. బీహార్ లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలతో పాటు దేశంలోని 15 రాష్ట్రాల్లో 64 స్థానాలకు ఉపఎన్నికలకు కూడా ఈసీఈ షెడ్యూల్‌ను ప్రకటించింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు కనుక ఈసీఈ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. బహిరంగ సభలు, ర్యాలీలకు అనుతమతి లేదని తెలిపింది. ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. 80 ఏళ్లు దాటిని వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com