బీహార్‌లో ముగిసిన తుది విడత పోలింగ్‌.. తగ్గిన ఓటింగ్ పర్సంటేజీ

బీహార్‌లో ముగిసిన తుది విడత పోలింగ్‌.. తగ్గిన ఓటింగ్ పర్సంటేజీ
X

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి విడుత పోలింగ్‌ ముసిగింది. పొలింగ్‌ ముగిసే సమయానికి దాదాపు 53 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. తుది విడుత పోలింగ్‌లో 78 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. 1204 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కిషన్‌ గంజ్‌ జిల్లాలో ఇప్పటివరకు 60 శాతం పోలింగ్ నమోదైంది. కతిహార్‌లో 48 శాతం నమోదైంది. బీహార్‌ తొలి విడత ఎన్నికలు అక్టోబర్‌ 28న 71 నియోజకవర్గాల్లో జరిగింది. రెండో విడత ఎన్నికలు నవంబర్‌ 3న 94 నియోజకవర్గాల్లో జరిగింది. నితీశ్ కుమార్‌ సీఎం అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి, తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ కూటమి ఈ ఎన్నికల్లో హోరాహోరీగా పోటిపడ్డాయి. అయితే.. బీహార్‌లో గతం కంటే తగ్గిన ఓటింగ్ పర్సంటేజీ తగ్గింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు.. మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి.

Tags

Next Story