IPS officer Amit Lodha : ఖాకీ-ది బిహార్ చాప్టర్.. చిక్కుల్లో పడ్డ ఐపీఎస్ ఆఫీసర్

IPS officer Amit Lodha : నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఖాకీ-ది బిహార్ చాప్టర్ వెబ్ సిరీస్‌తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న బిహార్ ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోధా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ ఆయనపై కేసు నమోదైంది.
దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. బిహార్‌లో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను అరెస్టు చేసిన తీరుపై లోధా బిహార్ డైరీస్ పేరుతో బుక్ రాశారు. ఈ బుక్ ఆధారంగా ఖాకీ-ది బిహార్ చాప్టర్ పేరుతో వెబ్ సిరీస్ తీసేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఐతే అంతకంటే ముందే ఆయన భార్య ఖాతాలో 49 లక్షల రూపాయలు జమయినట్లు పోలీసులు గుర్తించారు. అమిత్ లోధాపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
అమిత్ లోధా రాసిన బుక్ ఆధారంగా తీసిన ఈ వెబ్ సిరీస్‌లో కరణ్ టక్కర్, అమినాష్ తివారీ, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బిహార్‌లో తొలి పోస్టింగ్ పొందిన అమిత్ లోధా కిడ్నాప్ గ్యాంగ్‌లను ఎలా అంతమొందించాడు, చందన్ మెహత అనే గ్యాంగ్‌స్టర్‌ను ఎలా పట్టుకున్నాడనే కధాంశంతో ఈ వెబ్‌సిరీస్ నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com