50 ఏళ్లు వచ్చాయి.. ఎవరూ పిల్లనివ్వట్లేదని..

50 ఏళ్లు వచ్చాయి.. ఎవరూ పిల్లనివ్వట్లేదని..
ఏ వయసుకి ఆ ముచ్చట అని పెద్దలు ఊరికే అనలేదు.

ఏ వయసుకి ఆ ముచ్చట అని పెద్దలు ఊరికే అనలేదు. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికి రాదంటారు. కానీ పాపం ఆయనకి 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవాలనే కోరిక మాత్రం చావలేదు. వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. 50 ఏళ్లు దాటుతున్నాయి ఎవరో ఒకరులే అని హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. అదీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు బీహర్ చాప్రా జిల్లాకు చెందిన మహావీర్.

పెళ్లి చేసుకున్న తర్వాత గ్రామానికి చేరుకున్న మహావీర్ జంటను చూడడానికి గ్రామ ప్రజలు గుమిగూడారు. ప్రజలు ఈ జంట యొక్క ఫోటోలను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించారు. ఇది చూసి నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. కొంతమంది దీనిని ఇది అతడి వ్యక్తిగత విషయం అని వర్ణించగా, మరి కొంతమంది ఇప్పుడు అమ్మాయిల కొరత ఉంది కాబట్టి హిజ్రాను వివాహం చేసుకున్నాడని చెప్పారు. వివాహం తరువాత, మహావీర్ గ్రామంలో విందును కూడా ఏర్పాటు చేశాడు. పెళ్లి విందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వధూవరులను అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story