జేడీయూ, బీజేపీ మధ్య మారిపోయిన సీట్ల పంపకాల లెక్కలు

జేడీయూ, బీజేపీ మధ్య మారిపోయిన సీట్ల పంపకాల లెక్కలు

బిహార్‌ లో ఎన్డీఏ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ఏర్పాడ్డ ప్రతిష్టంభణకు బీజేపీ-జేడీయూలు తెరదించాయి. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయ వాటా కింద 122 స్థానాలు, బీజేపీ వాటా కింద 121 స్థానాలకు అంగీకరించాయి.

సీఎం నితీష్ కుమార్‌ దీనిపై స్పష్టత ఇచ్చారు. బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారైనట్లు ప్రకటించారు. 115 స్థానాల నుంచి జేడీయూ పోటీ చేస్తుందని చెప్పారు. తమ వాటాగా వచ్చిన 122 స్థానాల్లో ఏడింటిని జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చాకు ఇస్తామన్నారు. 121 స్థానాల నుంచి బీజేపీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు.

మరోవైపు లోక్ జన శక్తి పార్టీపై నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. జేడీయూ సహాయం లేకుండా ఆయన రాజ్యసభకు వెళ్ళారా? అని ప్రశ్నించారు. బిహార్ శాసన సభలో ఆ పార్టీకి ఉన్న స్థానాలు ఎన్ని? అని ప్రశ్నించారు.

మరోవైపు బీజేపీ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సక్సెస్‌ అయితే బీజేపీ తన వాటాలోని కొన్ని స్థానాలను వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి ఇస్తుంది. ప్రస్తుతం

ఎన్డీయే కూటమి నుంచి లోక్ జన శక్తి పార్టీ వైదొలగడంతో జేడీయూ, బీజేపీ మధ్య సీట్ల పంపకాల లెక్కలు మారిపోయాయి.

Tags

Next Story