Bihar: ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఇల్లు చూసి ఆనందంతో పేద ఎమ్మెల్యే కన్నీళ్లు..

Bihar: ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఇల్లు చూసి ఆనందంతో పేద ఎమ్మెల్యే కన్నీళ్లు..
Bihar: తానో నిరుపేద వ్యక్తి.. ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తూ ఆర్జేడీలో జాయినై ఎమ్మెల్యేగా ఎదిగాడు.

Bihar: తానో నిరుపేద వ్యక్తి.. ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తూ ఆర్జేడీలో జాయినై ఎమ్మెల్యేగా ఎదిగాడు. అప్పటి వరకు అతడు రాజీవ్ గహ కల్ప ఇంటిలో ఉండేవాడు. ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం అతనికి మూడు అంతస్థుల వసతి గృహాన్ని నిర్మించి ఇచ్చింది. దాంతో అతడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.


బీహార్‌లోని ఖగారియా జిల్లా అలౌలీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఎమ్మెల్యే రామ్వృక్ష్ సదా. అతడికి ఇటీవల పాట్నాలో మూడు అంతస్తుల ప్రభుత్వ వసతి గృహాన్ని ఇచ్చారు. బీహార్‌లో అత్యంత పేద ఎమ్మెల్యేగా చెప్పుకునే సదా, ఇంటి తాళాలు తీసుకునే సమయంలో ఉద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఎమ్మెల్యే ప్రస్తుతం ఇందిరా ఆవాస్ యోజన కింద నిర్మించిన రెండు పడక గదుల ఇంట్లో నివసిస్తున్నారు. అతడికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తమ ప్రతినిధుల కోసం బీహార్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్ట్ కింద ఇళ్లను కేటాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో సదా ఒకరు.


"నేను బీహార్‌లో అత్యంత పేద ఎమ్మెల్యేని. పేదవాడికి ఏదైనా లభించినప్పుడు ఆరోజే అతడికి నిజమైన దీపావళి అని సదా తనకు వచ్చిన బహుమతి గురించి చెప్పారు. "ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాకు కొత్త ఇంటి తాళాలను అందజేశారు.. నా జీవితంలో నేను కలలో కూడా ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించ లేదు అని భావోద్వేగానికి గురయ్యారు.


భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలలో అత్యంత పేదలుగా చెప్పబడే "ముసహర్" సంఘం నుండి తాను వచ్చానని సదా చెప్పారు. ముసాహర్ అంటే "ఎలుకలు తినేవారు" అని అర్థం. ఇది మహాదళిత్ సమాజానికి అవమానకరమైన పదం, ఎలుకలను పట్టుకోవడం వారి వృత్తి.


ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించినట్లుగా సదా మొత్తం చరాస్తుల విలువ రూ.70,000. దీంతో అతడు అత్యంత నిరుపేద ఎమ్మెల్యేగా రికార్డుకు ఎక్కారు.

Tags

Read MoreRead Less
Next Story