Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ దుర్మరణం..

Bipin Rawat: తమిళనాడు నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. త్రివిధ దళాల అధిపతి, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కూడా మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. 14మందితో వెళ్తున్న IAF-MI-17V5 హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఇందులో బిపిన్ రావత్ భార్య మధులిక కూడా ఉన్నారు.
With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీంలు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. డెడ్ బాడీలను వెల్లింగ్ టన్ హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలు ఎవరివో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. దీంతో DNA పరీక్షలు చేసి మృతదేహాలు ఎవరివని గుర్తించే పనిలో ఉన్నారు. హెలికాప్టర్ కూలిన ఘటనపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విచారణకు ఆదేశించింది. కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. హెలికాప్టర్ ప్రమాదంపైనా ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. రేపు పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.
My heart goes out to the families of those who lost their loved ones in this accident. Praying for the speedy recovery of Gp Capt Varun Singh, who is currently under treatment at the Military Hospital, Wellington.
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తాము చూస్తుండగానే హెలికాప్టర్ కిందకు వస్తూ ఓ చెట్టును బలంగా ఢీ కొట్టిందన్నారు. అందులో ఉన్నవాళ్లంతా బిగ్గరగా అరిచారని తెలిపారు. ఇంతలోనే హెలికాప్టర్ లో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయని.. ముగ్గురు, నలుగురు కాలిపోతూ కిందకు దూకేశారని చెబుతున్నారు. ఆ దృశ్యాలు చూసిన తాము అక్కడి నుంచి భయంతో పరుగులు తీశామన్నారు. తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చామన్నారు ప్రత్యక్ష సాక్షి క్రిష్ణస్వామి.
General Rawat had served the country with exceptional courage and diligence. As the first Chief of Defence Staff he had prepared plans for jointness of our Armed Forces.
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021
Deeply anguished by the sudden demise of Chief of Defence Staff Gen Bipin Rawat, his wife and 11 other Armed Forces personnel in an extremely unfortunate helicopter accident today in Tamil Nadu.
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021
His untimely death is an irreparable loss to our Armed Forces and the country.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com