Bipin Rawat : బిపిన్ రావత్ చివరి కోరిక ఇదే...కానీ అంతలోనే..

తన చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్.. నిన్న (బుధవారం) తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ఘోర ప్రమాదంలో ఆయన మరణించారు. బిపిన్ రావత్ రిటైరయ్యాక ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామమైన 'సైనా'లో ఇళ్లు కట్టుకొని అక్కడే జీవించాలని అనుకున్నారట.. ఈ విషయాన్ని బిపిన్ రావత్ మేనమామ భరత్ తెలిపారు.
2018 చివరిసారిగా ఆయన సొంతూరును సందర్శించారని, అక్కడ తమ కులదేవతకు ప్రార్థనలు చేశారని ఆయన చెప్పారు. స్వగ్రామంతో బిపిన్‌కు అనుబంధం చాలా ఎక్కువని అన్నారు. ఉపాధి కోసం జనాలు వలస వెళ్ళడం తనకి బాధగా అనిపిస్తోందని రిటైరయ్యాక ఈ ప్రాంతం కోసం ఏదైనా చేయాలనీ బిపిన్ తనతో ఫోన్లో చెప్పినట్టుగా భరత్ చెప్పారు.
కానీ తన మేనల్లుడి కోరిక తీరకుండానే ఇలా జరుగుతుందని ఊహించలేదని భాగోద్వేగానికి లోనయ్యారు. కాగా రావత్ దంపతుల అంత్యక్రియలు రేపు ఢిల్లీలో జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com