Bipin Rawat: తమిళనాడులోని హెలికాఫ్టర్ ప్రమాదంలో 11 మంది మృతి..! చీఫ్ బిపిన్ రావత్ భార్య కూడా..!

Bipin Rawat (tv5news.in)
X

Bipin Rawat (tv5news.in)

Bipin Rawat: తమిళనాడులోని కూనూరులో ఘోర ప్రమాదం జరిగింది.

Bipin Rawat: తమిళనాడులోని కూనూరులో ఘోర ప్రమాదం జరిగింది. 14మంది ఉన్నతాధికారులతో వెళ్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఘోర ప్రమాదలో 10మంది ఉన్నతాధికారులు చనిపోయినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిత రావత్ కూడా ఉన్నారు. ప్రమాదంలో బిపిన్ రావత్ కు తీవ్ర గాయాలు కాగా.. ఆయన భార్య మధులిక చనిపోయినట్లు సమాచారం. హుటాహుటిన తమిళనాడులోని విల్లింగ్ టన్ హాస్పిటల్ కు బిపిన్ రావత్ ను తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్ కు చేరుకున్న ఎమర్జెన్సీ రెస్క్యూ టీం మరో ముగ్గురుని రక్షించింది. సాంకేతిక సమస్య వల్లే ప్రమాదం జరిగిందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసర సమావేశం కొనసాగుతోంది. అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అత్యవసర సమావేశం నిర్వహించారు. మృతదేహాలను తమిళనాడులోని విల్లింగ్ టన్ ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story