మెల్‌బోర్న్ రెస్టారెంట్‌లో క్రికెటర్లు.. మరీ బావుండదు 'బ్రదర్' అంటూ రోహిత్ శర్మ

మెల్‌బోర్న్ రెస్టారెంట్‌లో క్రికెటర్లు.. మరీ బావుండదు బ్రదర్ అంటూ రోహిత్ శర్మ
అక్కడ ఉన్న ఓ రెస్టారెంట్‌లో రిషబ్ పంత్, రోహిత్ శర్మ, నవదీప్ సైని ఫుడ్ ఆర్డర్ ఇచ్చి టేస్ట్ చేస్తున్నారు.

క్రికెట్.. ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరించే ఓ అభిమాన క్రీడ. సినిమా నటీ నటులకు ఎంత పాపులారిటీ ఉంటుందో అంతటి అభిమానాన్ని కనబరుస్తారు క్రికెటర్ల పట్ల ఫ్యాన్స్. భారత క్రికెట్ జట్టు ప్రపంచంలో అత్యధికంగా అనుసరిస్తున్న వారిలో ఒకటి. క్రికెట్ వేదికలపై భారతీయ బృందాన్ని చూడడానికి అభిమానులు ఉత్సాహపడుతుంటారు. తాజాగా ఆస్ట్రేలియాలోని ఒక భారతీయ అభిమాని అదే రెస్టారెంట్‌లో తింటున్న భారతీయ ఆటగాళ్ల బిల్లును చెల్లించి భారత క్రికెటర్లపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నాడు.

బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత మెల్బోర్న్‌లో ఈ సంఘటన జరిగింది. ఆటగాళ్ళు న్యూ ఇయర్‌కి ముందు నగరంలోని సుందర దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఉన్న ఓ రెస్టారెంట్‌లో రిషబ్ పంత్, రోహిత్ శర్మ, నవదీప్ సైని ఫుడ్ ఆర్డర్ ఇచ్చి టేస్ట్ చేస్తున్నారు. ఇంతలో నవల్‌దీప్ సింగ్ అనే క్రికెట్ అభిమాని ఇండియన్ క్రికెటర్స్ బిల్ పేచేశారు.

భారత్‌కు చెందిన నవల్ దీప్ సింగ్ మెల్‌బోర్న్‌లో ఉంటున్నారు. జనవరి 1న అతడు ఆస్ట్రేలియాలోని ఒక హోటల్‌కు వెళ్లగా అక్కడే తనకు ఇష్టమైన ఇండియన్ క్రికెటర్స్ భోజనం చేస్తున్నారు. అనుకోకుండా వారిని చూడడం నవల్ దీప్‌కి అత్యంత ఆనందాన్నిచ్చింది. మరో ఆలోచన లేకుండా వెంటనే వాళ్లు తిన్న బిల్లు నేను పే చేస్తాను సార్ అని రెస్టారెంట్ యజమానితో మాట్లాడి మొత్తం బిల్లు పే చేశాడు. సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో,బిల్లు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నేను బిల్లు చెల్లించినట్లు వాళ్లకి తెలియదు. బిల్లు పే చేశానని తెలుసుకున్న రోహిత్ నా వద్దకు వచ్చి బ్రదర్ డబ్బులు తీసుకో.. మీరు చెల్లించడం బావుండదు అని అన్నాడు.. నా సూపర్ స్టార్స్ కోసం నేను ఆ మాత్రం చేయలేనా. ఆ తర్వాత పంత్ నన్ను హగ్ చేసుకున్నాడు. అందరం కలిసి ఓ ఫోటో తీసుకున్నాం అని పోస్ట్ చేశాడు.

Tags

Next Story