జాతీయ కార్యవర్గంలో తెలుగువారికి కీలక పదవులు

జాతీయ కార్యవర్గంలో తెలుగువారికి కీలక పదవులు
X
తెలుగునేతలు జీవీఎల్‌, రాంమాధవ్, మురళీధర్ రావులకు చోటు దక్కలేదు.

కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఇందులో తెలుగువారికి కీలక పదవు ఇచ్చింది. తెలుగురాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. దగ్గుబాటి పురందేశ్వరికి కూడా తాజా కార్యవర్గంలో సముచిత స్థానం లభించింది. ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు. అయితే... తెలుగునేతలు జీవీఎల్‌, రాంమాధవ్, మురళీధర్ రావులకు చోటు దక్కలేదు.


Tags

Next Story