BJP - Congress : 'ఫోజు నెక్స్ట్ లెవెల్' రాహుల్ కు బీజేపీ నేత కితాబు

'భారత్ జోడో యాత్ర' తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్ లో పర్యటిస్తున్నారు . లండన్ పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన, భారత్ లో ప్రతిపక్షం నోరు నొక్కేస్తున్నారని అన్నారు. భారత్ లో ప్రజాస్వామ్య సమస్యలను పరిష్కరించడానికి విదేశీ జోక్యం అవసరమన్నారు. అయితే అవి అంతర్గత సమస్యలని అందుకు అంతర్గత పరిష్కారాలే అవసరమని అభిప్రాయపడ్డారు రాహుల్.
లండన్ లో రాహుల్ గాంధీ ఫొటోను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో రాహుల్, సూట్ వేసుకుని స్టయిల్ గా నిల్చున్నారు. కాంగ్రెస్ అభిమానులంతా కాబోయే పీఎం అంటూ కితాబిచ్చారు. ఆ ఫోటోకు నాగాలాండ్ బీజేపీ చీఫ్ టెమ్‌జెన్ ఇమ్నా తనదైన శైలిలో కామెంట్ చేశారు. "నమ్మాల్సిందే, ఫోటో అయితే బాగుంది. కాన్ఫిడెన్స్, ఫోజు నెక్స్ట్ లెవల్" అంటూ ట్వీట్ చేశారు.
ప్రతిపక్షాల నోరు నొక్కేస్తున్నారన్న రాహుల్ మాటలపై స్పందించారు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ అటెండెన్స్ కేరళ సగటు కంటే చాలా తక్కువని అన్నారు. ముందుగా రాహుల్ పార్లమెంట్ కు హాజరవ్వాలని అప్పుడే ప్రతిపక్షం నోరు నొక్కేస్తున్నారో లేదో తెలుస్తుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com