10 Sep 2020 2:23 PM GMT

Home
 / 
జాతీయం / కంగనా రనౌత్‌ను ఆమె...

కంగనా రనౌత్‌ను ఆమె శత్రువుల హత్య చేసే అవకాశం ఉంది: బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ గుర్జర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

కంగనా రనౌత్‌ను ఆమె శత్రువుల హత్య చేసే అవకాశం ఉంది: బీజేపీ ఎమ్మెల్యే
X

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ గుర్జర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీ నుంచి తనకు ప్రాణ భయం ఉందని లేఖలో వివరించారు. సుమారు నెల రోజుల నుంచి తనకు విదేశాలను నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని నంద కిశోర్ గుర్జర్ తెలిపారు. ఈ కాల్స్ వెనుక దావూద్ ఇబ్రహీం ఉన్నారని తనుకు అనుమానంగా ఉందన్నారు. 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌లో తనను చట్టవిరుద్ధంగా చూపించారని.. వెబ్ సిరీస్‌ను నిషేధించాలని ఇటీవల తాను కోరానని లేఖలో పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి కూడా చెడుగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ సిరీస్ నిర్మాణం వెనుక కూడా డీ-కంపెనీ ఉందన్నారు. దీంతో పాటు బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ కు కూడా ప్రాణహాని ఉందని అన్నారు. ఆమె శత్రువులు హత్య చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story