అయోధ్య రామమందిరానికి గంభీర్ కోటి రూపాయల విరాళం!

అయోధ్య రామమందిరానికి భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రామమందిర నిర్మాణానికి తన వంతుగా రూ. కోటి ఇస్తున్నట్టుగా తెలిపారు. అద్భుతమైన రామ మందిర నిర్మాణం భారతీయులందరీ కల అని.. ఎట్టకేలకు అది నేరవేరబోతుందని అన్నారు. రాములోరి గుడి ప్రశాంతత, ఐకమత్యానికి బాటలు వేస్తోందని, ఈ ప్రయత్నంలో నా నుండి మరియు నా కుటుంబం నుండి ఒక చిన్న సహకారం అందిస్తున్నామని గంభీర్ అన్నాడు.
కాగా, గత కొద్ది రోజులు క్రితమే భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా రామమందిరానికి ఆలయానికి విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది ఆగస్టులో భూమి పూజ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com