బీజేపీ ఎంపీ మనవరాలి ప్రాణం తీసిన దీపావళి టపాసులు

బీజేపీ ఎంపీ మనవరాలి ప్రాణం తీసిన దీపావళి టపాసులు
దీపావళి టపాసులు కాల్చే సమయంలో చిన్నారి ఫాన్సీ దుస్తులను ధరించింది

దీపావళి సందర్భంగా పటాకులు పేల్చినప్పుడు జరిగిన గాయాలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి రీటా బహుగుణ జోషి మనవరాలు మరణించినట్లు జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. నివేదికల ప్రకారం, ఎనిమిదేళ్ల బాలిక మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది.

ఈ సంఘటన జోషి యొక్క ప్రయాగ్రాజ్ నివాసంలో జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. చిన్నారిని మొదట నగరంలోని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి అత్యవసర వైద్య చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

చిన్నారి టెర్రస్ మీద ఇతర పిల్లలతో ఆడుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీపావళి టపాసులు కాల్చే సమయంలో చిన్నారి ఫాన్సీ దుస్తులను ధరించింది. ఆమె ధరించిన దుస్తులు టపాసుల నుండి వెలువడే మంటలను ఆకర్షించాయి. మంటలు అంటుకున్న సమయంలో అరిచినా ఎవరికీ వినిపించలేదు.

కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు టెర్రస్ మీదకు వెళ్లగా అప్పటికే తీవ్రంగా కాలిన గాయాలతో పడి ఉన్నట్లు వారు చూశారు. వెంటనే చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలికకు 60 శాతం కాలిన గాయాలు అయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెను ఎయిర్ అంబులెన్స్‌లో అధునాతన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఎనిమిదేళ్ల చిన్నారి.. రీటా బహుగుణ కుమారుడు మయాంక్ జోషి, అతని భార్య రిచా జోషి దంపతుల ఏకైక కుమార్తె. రీటా బహుగుణ జోషి ప్రయాగ్రాజ్‌కు చెందిన లోక్‌సభ ఎంపి. జోషి ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఐదు సంవత్సరాలు (2007 నుండి 2012 వరకు) పనిచేశారు. 2016 లో బిజెపిలో చేరారు.

Tags

Next Story