టీఎంసీలోకి భార్య.. విడాకులు ఇస్తానన్న బీజేపీ ఎంపీ!

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి భారీ షాక్ ఇస్తూ.. ఆ పార్టీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్(Sujata Mondal Khan) సోమవారం తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress)లో చేరారు. ఆ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీలో ఒక మహిళగా తనకి దక్కాల్సిన గౌరవం దక్కలేదని, అందుకే తాను తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినట్టు వెల్లడించారు.
ఆమె టీఎంసీలో చేరడం పట్ల ఆమె భర్త, ఎంపీ సౌమిత్రా ఖాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొంతకాలం తర్వాత తన భార్య సుజాతకు విడాకుల ఇస్తానని తెలిపారు. ఇకపై తన పేరు, ఇంటి పేరు నుంచి ఆమెకు విముక్తి ఇస్తున్నానని అయన వెల్లడించారు. తన ఆస్తి కావాలంటే తానూ తీసుకోవచ్చునని, లేదంటే దానిని దానం చేస్తానని సౌమిత్రా ఖాన్ తెలిపారు. అటు తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినందుకు టీఎంసీని ప్రజలు క్షమించరని, ఆ పార్టీని రాష్ట్రం నుండి తరిమివేస్తారని అన్నారు సౌమిత్రా ఖాన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com