Brijbhushan Sharan Singh : యువ రెజ్లర్‌పై చేయిచేసుకున్న బీజేపీ ఎంపీ

Brijbhushan Sharan Singh : అందరు చూస్తుండగానే క్రీడాకారుడిపై చేయిచేసుకున్నారు బీజేపీ ఎంపీ. ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. రాంచీలో జరుగుతున్న అండర్-15 జాతీయ స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఉత్తరప్రదేశ్ కైసర్‌గంజ్ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్. ఆయన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కార్యక్రమానికి వచ్చిన ఎంపీ వద్దకు వచ్చిన ఓ యువకుడు.. తనకు ఆడే అవకాశం కల్పించాలని పదేపదే విజ్ఞప్తి చేశాడు. అతని వయస్సు పరిమితి దాటిపోవడంతో.. అధికారులు అనికి ఆడే అవకాశం కల్పించలేదు. వయస్సు పరిమితి దాటినా పదేపదే వచ్చి అడుగుతుండటంతో విసిగిపోయిన ఎంపీ.. యువకుడిపై విచుకుపడ్డారు. రెండు చెంపలు చెళ్లు మనిపించారు. దీంతో కలుగజేసుకున్న అధికారులు.. యువకుడిని అక్కడి నుంచి పంపించేశారు.
As instructed by @narendramodi , his MP started to train the wrestlers on the stage itself. Preparation for the next Olympics is at next level. #brijbhushansharansingh pic.twitter.com/Qf313HBzMs
— Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) December 18, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com