BJP : రాజ్యసభలో సెంచరీ కొట్టిన బీజేపీ..!

BJP : రాజ్యసభలో సెంచరీ కొట్టిన బీజేపీ..!
BJP : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అరుదైన ఘనతను సాధించింది.. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో మూడంకెల సంఖ్యను పొందింది.

BJP : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అరుదైన ఘనతను సాధించింది.. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో మూడంకెల సంఖ్యను పొందింది. బీజేపీ చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో 101 మంది సభ్యులను కలిగి ఉంది. మూడు దశాబ్దాలలో (1988-1990) తర్వాత ఎగువ సభలో ఒక పార్టీ సెంచరీ మార్క్ దాటడం ఇదే తొలిసారి.

గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 13 స్థానాలకు గాను బీజేపీ 4 సీట్లు గెలుచుకుని ఈ ఘనతను అందుకుది. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. దీనితో అప్పటివరకు బీజేపీకి 97 ఉన్న సంఖ్య ఇప్పుడు 101కి చేరుకుంది.

కాగా ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యసభలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం ఐదు స్థానాలకి తగ్గింది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల సంఖ్య 29గా ఉంది. ఇక పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభలో తన బలాన్ని అయిదు నుంచి ఎనిమిదికి పెంచుకుంది.

ఆటు బీజేపీ కంటే ముందు కాంగ్రెస్‌ 1962లో అ‍త్యధికంగా 162 సీట్లను కలిగి ఉంది. 1988 వరకూ కాంగ్రెస్ పార్టీకి ఉభయసభల్లో సంపూర్ణ మెజారిటీ ఉండేది.

Tags

Read MoreRead Less
Next Story