ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలకు బీజేపీ సన్నాహాలు..!

దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట పెంచేలా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 7వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ నెల 17న 71వ వసంతంలోకి అడుగుపెట్టనున్న మోదీ పుట్టిన రోజు సంబరాలు అంబరాన్నంటేలా "సేవా, అంకితం" నినాదంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది.
మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని... "పీఎం గరీబ్ కల్యాణ్ యోజన" కింద రూ.5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. బియ్యం బ్యాగులపై "థ్యాంక్ యూ మోదీజీ" రాయించడంతో పాటు మోదీ చిత్రపటం ముద్రించనున్నారు. లబ్ధిదారులతో "థ్యాంక్ యూ మోదీజీ" అని చెప్పిస్తూ వీడియో చిత్రీకరించనున్నారు. 71 చోట్ల నదుల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నందుకు"థ్యాంక్ యూ మోదీజీ" అని చెప్పిస్తూ వీడియో చిత్రీకరించనున్నారు. మోదీ జీవితం, పని తీరుపై విభిన్న వర్గాల ముఖ్యులతో జిల్లా, రాష్ట్ర స్థాయి సమావేశాలు, ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నారు. కొవిడ్‌తో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల వివరాల సేకరించనున్నారు. మోదీకి వచ్చిన మెమెంటోల అమ్మకానికి బిడ్డింగ్ నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com