గుజరాత్ రాజకీయ సమీకరణాలను మార్చే యోచనలో బీజేపీ

X
By - Prasanna |11 Sept 2021 4:02 PM IST
వచ్చే ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో బోటాబోటీ మెజారిటీతో గెల్చిన బీజేపీ...
వచ్చే ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో బోటాబోటీ మెజారిటీతో గెల్చిన బీజేపీ... ఈ సారి మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితుల్ని గమనిస్తూ... నాయకత్వ మార్పులు చేస్తోంది. కర్నాటక, ఉత్తరాఖండ్ సీఎంలను మార్చిన బీజేపీ. బీజేపీ అధిష్ఠానం ఆలోచనతో సీఎం పదవికి రూపానీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అప్పగించిన బాధ్యతను నెరవేర్చాను అని రాజీనామా చేసిన రూపానీ అంటున్నారు. కొత్త సీఎం ఎంపిక బాధ్యత అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అనారోగ్యం కారణంగానే రాజీనామా చేశానని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com