Exit Poll 2022 : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకే పట్టం.. పంజాబ్‌లో ఆప్‌దే అధికారమన్న సర్వేలు..!

Exit Poll 2022 : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకే పట్టం.. పంజాబ్‌లో ఆప్‌దే అధికారమన్న సర్వేలు..!
Exit Poll 2022 : దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ సంగ్రామం ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit Poll 2022 : దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ సంగ్రామం ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌పై ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్‌ ప్రక్రియ ముగిసీ ముగియగానే వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌.. యూపీలో యోగికే మళ్లీ పట్టం కట్టాయి. ఆత్మసాక్షి మినహా అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ యూపీలో బీజేపీదే అధికారమని తేల్చి చెప్పాయి. ఏడు దశల్లో జరిగిన యూపీ ఎన్నికల్లో మెజారిటీ బీజేపీకే వస్తుందని, అయితే గతంతో పోలిస్తే సీట్లు తగ్గుతాయని తేల్చాయి. పంజాబ్‌లో ఆప్‌ వెల్లువిరుస్తుందని, ఉత్తరాఖండ్‌లో బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ తప్పదని, గోవాలో కాంగ్రెస్‌ వస్తుందని అంచనా వేశాయి.

మొత్తం 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 225 నుంచి 255 సీట్లు సాధిస్తుందని పీమార్క్‌ ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది. ఎస్పీకి 130 నుంచి 155 సీట్లు, బీఎస్పీ 12 నుంచి 22, కాంగ్రెస్‌ 2 నుంచి 6 సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది. మాట్రిజ్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా బీజేపీకే పట్టం కట్టాయి. బీజేపీ 262 నుంచి 277, ఎస్పీ 119 నుంచి 134, బీఎస్పీ 7 నుంచి 15, కాంగ్రెస్‌ 3 నుంచి 8 సీట్లు సాధిస్తాయని తెలిపింది. సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 కూడా బీజేపీకే మెజారిటీ లభిస్తుందని చెప్పింది. బీజేపీ 240, ఎస్పీ 140, బీఎస్పీ 17 సాధిస్తాయని అంచనా వేసింది. కాగా ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్‌ మాత్రం ఎస్పీకే అధికారం దక్కుతుందని అంచనా వేసింది. ఎస్పీకి 235 నుంచి 240, బీజేపీ 138 నుంచి 140, బీఎస్పీ 19 నుంచి 23, కాంగ్రెస్‌ 12 నుంచి 16 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

పంజాబ్‌లో ఆప్‌ అధికారం చేపడుతుందని ఎగ్జిట్స్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. పీమార్క్‌తో పాటు చాలా సంస్థలు ఆప్‌కే పట్టం కట్టాయి. ఆప్‌ 62 నుంచి 70 సీట్లు, కాంగ్రెస్‌ 23 నుంచి 31 సీట్లు, అకాలీదళ్‌ 16 నుంచి 24, బీజేపీ కూటమి 1 నుంచి 3 సీట్లు సాధిస్తాయని పేర్కొన్నాయి. ఆత్మసాక్షి మాత్రం పంజాబ్‌లో కాంగ్రెస్‌ తిరిగి అధికారం చేపడుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 58 నుంచి 61 సీట్లు, ఆప్‌ 34 నుంచి 38 సీట్లు, అకాలీదళ్‌ 18 నుంచి 21 సీట్లు, బీజేపీ కూటమి 4 నుంచి 5 సీట్లు వస్తాయని పేర్కొంది.

గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా సీట్లు సాధిస్తాయని, అయితే కాంగ్రెస్‌కే కాస్త మొగ్గు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేశాయి. సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీకి 11నుంచి 16, కాంగ్రెస్‌కు 11 నుంచి 17, ఆప్‌ రెండు సీట్లు, ఇతరులు 5 నుంచి 7 సీట్లు సాధిస్తాయి. జన్‌కీ బాత్‌-ఇండియా న్యూస్‌ మాత్రం బీజేపీకే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పేర్కొంది. బీజేపీ 13 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్‌ పది నుంచి 14 సీట్లు, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 7 నుంచి 8 సీట్లు, ఎన్‌పీఎఫ్‌ 5 నుంచి 7, జేడీయూ 5 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 37, కాంగ్రెస్‌ 31, ఆఫ్‌ ఒకటి సాధిస్తాయని టైమ్స్ నౌ-వీటో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసింది. ఇక మణిపూర్‌లో బీజేపీ కూటమికే పట్టం కట్టాయి ఎగ్జిట్‌పోల్స్‌. జన్‌కీబాత్‌-ఇండియా న్యూస్‌ ప్రకారం బీజేపీ 23 నుంచి 25, కాంగ్రెస్‌ 10 నుంచి 14, ఎన్‌పీపీ 7 నుంచి 8 , ఎన్‌పీఎఫ్‌ 5 నుంచి 7, జేడీయూ 5 నుంచి 7 సీట్లు సాధిస్తాయని తెలిపింది. మరి.. మార్చి 10న వెలువడుతున్న ఫలితాలతో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజమవుతాయా..? లేక తలకిందులవుతాయా..? అంతిమంగా మినీ సంగ్రామంలో గెలిచేది ఎవరనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story