Uttar pradesh : యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే హవా..!

Uttar pradesh : ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ.. శాసనమండలి ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. ఏప్రిల్ 9న 36 స్థానాలకు జరిగిన పోలింగ్ లో బీజేపీ 33కి స్థానాల్లో గెలిచింది. మిగిలిన స్థానాల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వీటిలో ఒకటి అజంగఢ్, రెండవది వారణాసి మరియు మూడవది ప్రతాప్‌గఢ్ ప్రాంతాలున్నాయి.
36 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే 9 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా కాగా, మిగిలిన 27 స్థానాల్లో బీజేపీ ఏకపక్షంగా దూసుకెళ్లింది. అటు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. 33 స్థానాలు గెలుచుకోవడంతో శాసనమండలిలోనూ బీజేపీకి మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి ఇలా రెండింటిలోనూ ఒక పార్టీకి అఖండ మెజారిటీ రావడం 40 ఏళ్లల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం.
గతంలో 1982లో కాంగ్రెస్‌కు ఉభయ సభల్లో మెజారిటీ వచ్చింది. ఇక నూతనంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులకు, పార్టీ విజయం సాధించిన కార్యకర్తలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు జాతీయత, అభివృద్ధి, సుపరిపాలనతో ఉన్నారని తాజా ఎన్నికల్లో బీజేపీ విజయం దానిని స్పష్టం చేసిందని యోగి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com