భార్య బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్... అదే ఆఫీసులో భర్త స్వీపర్..!
తానూ స్వీపర్‌గా పనిచేస్తున్న ఆఫీస్‌లోనే తన భార్య బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్‌గా ఎన్నికవుతుందని ఆ భర్త కలలో కూడా ఉహించలేకపోయాడు. కానీ అదే జరిగింది. ఇదేలా సాధ్యమైందంటే.. ఉత్తరప్రదేశ్‌లో బ్లాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బలియాఖేరీ బ్లాక్‌లోని 55వ వార్డు నుంచి సోనియా(26) అనే మహిళ పోటీ చేసి గెలిచింది. సోనియా దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ పైగా విద్యావంతురాలు కూడా..ఆ తర్వాత బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్ ఎన్నికలు జరగ్గా.. బలియాఖేరి బ్లాక్ ఎస్సీ కేటగిరికి కేటాయించారు.
ఈ ఎన్నికల బరిలో సోనియాని బీజేపీ నిలబెట్టింది. ఇందులో కూడా సానియా విజయం సాధించింది. అయితే ఇదే ఆఫీస్‌లో ఆమె భర్త సునీల్‌కుమార్ గత కొంతకాలంగా స్వీపర్‌గా పనిచేస్తుండడం విశేషం. ఈ జంట నల్హేరా గుజ్జర్ గ్రామంలో నివసిస్తున్నారు. సోనియా మరియు సునీల్ 2014లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భార్య బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్‌గా ఎన్నికైనప్పటికి తాను ఇదే స్వీపర్ పనిలో కొనసాగుతానని సునీల్ చెప్పడం మరో విశేషం.
ఇక ఈ ప్రయాణంలో తన భర్త మరియు కుటుంబం తనకి ఎంతో మద్దతు ఇచ్చిందని సోనియా తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే లక్ష్యమని అన్నారు. కాగా సోనియా ఇటీవల ఉత్తర ప్రదేశ్ సహారాన్‌పూర్‌లోని బలియఖేరి బ్లాక్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు .
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com