Bodh Gaya: దలైలామాకి ప్రాణహాని; చైనా మహిళ కోసం సెర్చ్ వారెంట్!
BodhGaya

Bodh Gaya: దలైలామాకి ప్రాణహాని; చైనా మహిళ కోసం సెర్చ్ వారెంట్!
బౌధ మతగురువు దలైలామాకు ప్రాణహాని ఉందని బీహార్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బోధ్ గయా ప్రాంతానికి లామా విచ్చేసిన సందర్భంగా ఓ చైనీస్ మహిళ కోసం సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఆమె వల్లే బౌధగురువుకు ప్రాణహాని ఉందని తెలుస్తోంది.
చైనాకు చెందిన సాంగ్ జియాలన్ అనే మహిళ స్కెచ్ ను రిలీజ్ చేసిన పోలీసులు ఈమె వల్లే దలైలామాకు ప్రాణహాని పొంచి ఉందని అనుమానిస్తున్నారు.
గతవారమే బోధ్ గయాకు చేరుకున్న దలైలామాకు గయా అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులతో పాటూ, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ త్యాగరాజన్, సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ హర్ ప్రీత్ కౌర్ ఘన స్వాగతం పలికారు.
ప్రతీ ఏటా ఇదే సమయంలో బోధ్ గయాలో దలైలామా విడిది చేయడం ఆనవాయితీగా వస్తోంది. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల అనంతరం బోధ్ గయాకు చేరుకున్న బౌధ గురువును ప్రజలు సైతం సాదరంగా ఆహ్వానించారు. గయాలోని టిబెట్ మానస్టరీకి వెళుతుండగా రోడ్డుకు ఇరువైపులా గుమిగూడిన ప్రజలు ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. మరోవైపు లామా వసతి దగ్గర పోలీసులు భద్రతను పెంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com