బొమ్మ బ్లాక్ బస్టర్.. రష్మీ ఫస్ట్ లుక్

బొమ్మ బ్లాక్ బస్టర్.. రష్మీ ఫస్ట్ లుక్
కిరీటం ధరించి, మెడలో పూల మాల, శ్రీవారి నామం పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న రష్మీ గెటప్ చూసి అభిమానులు..

బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్ననటి రష్మి గౌతమ్.. అడపా దడపా సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. గుంటూరు టాకీస్ చిత్రంతో భారీ స్థాయిలో విమర్శలనెదుర్కున్న రష్మీ తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ చిత్రంలో తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది.. విడుదలైన ఫస్ట్ పోస్టర్ చూస్తుంటే. హీరో నందూతో రష్మీ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. పోతురాజు (నందూ క్యారెక్టర్ పేరు) గాడి లవర్ వాణి అంటూ రష్మీ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రదీప్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.. రష్మీ ఈ లుక్ లో చాలా అందంగా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. కిరీటం ధరించి, మెడలో పూల మాల, శ్రీవారి నామం పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న రష్మీ గెటప్ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నందు పూరీ జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story