ట్రెయిన్ టికెట్లు 6 కంటే ఎక్కువ బుక్ చేయాలా.. అయితే ఇకపై ఇలా..

నెలకు ఆరు కంటే ఎక్కువ రైల్వే టికెట్లను బుక్ చేయాలనుకుంటే ఇకపై మీ ఆధార్ కార్డును ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆధార్ లింక్‌ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్‌టీసీ) తప్పనిసరి చేసింది. ఆధార్‌తో లింక్ చేయనట్ైతే ఆరు టికెట్లను మాత్రమే బుక్ చేసుకునే ఉంటుంది. ఆధార్‌తో ఐఆర్‌సీటీసీ లింక్ చేసే విధానం ఎలాగో తెలుసుకుందాం.
1. డెస్క్ట్‌టాప్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి.
2. ఆ తరువాత మై అకౌంట్ పై క్లిక్ చేసి.. డ్రాప్‌డౌన్‌లో వచ్చిన లింక్ యువర్ ఆధార్‌ను సెలెక్ట్ చేయాలి.
3. ఓపెన్ అయిన లింక్ ఆధార్ కేవైసీ పేజీలో.. ఆధార్ కార్డ్‌లో ఉన్న మీ పేరు, నంబరు నమోదు చేయాలి. నిబంధనలన్నీ ఓ సారి చదివి ఓటీపీ పైన క్లిక్ చేయాలి.
4. మీ ఆధార్ అటాచ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని సరి చూసుకోవాలి.
5. చివరిగా చెక్‌బాక్స్‌లో వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com