ఏం చదువుకోలే.. వంటలతో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది!

ఏం చదువుకోలే..  వంటలతో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది!
సుమన్ ధమనే( Suman Dhamane) ఏం చదువుకోలేదు. వంటలు మాత్రం అద్భుతంగా చేస్తుంది. ఆమె చేసిన వంటలు ఆమె 17 ఏళ్ల మనవడికి చాలా బాగా నచ్చాయి.

ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలంటే మనకి ముందుకు గుర్తుకువచ్చేవి రెండే రెండే.. అయితే గూగుల్ లేకపోతే యూట్యూబ్..యూట్యూబ్(YouTube) నుంచి చాలా మంది కొత్తకొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడమే కాదు. అదే యూట్యూబ్ నుంచి చాలా మంది ఉపాధి పొందుతున్నారు కూడా.. అందులో భాగంగానే ఓ 70 ఏళ్ల బామ్మ చేసిన వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్ లో చాలా పాపులర్ అవుతున్నాయి. ఆమె మహారాష్ట్రకు చెందిన 70ఏళ్ల సుమన్ ధమనే

సుమన్ ధమనే( Suman Dhamane) ఏం చదువుకోలేదు. వంటలు మాత్రం అద్భుతంగా చేస్తుంది. ఆమె చేసిన వంటలు ఆమె 17 ఏళ్ల మనవడికి చాలా బాగా నచ్చాయి. అయితే ఆ వంటలు అందరికి నచ్చేలా చేయాలనీ అనుకున్నాడు. దానికి యూట్యుబ్ ని వేదికగా చేసుకున్నాడు. వెంటనే 'ఆప్లీ ఆజీ'(Aapli Aaji) అనే పేరుతో ఓ యూట్యుబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాడు.

మనవడు యశ్ సాయంతో ఆమె తన వంటలను నెట్టింట్లో అప్ లోడ్ చేస్తోంది ఈ బామ్మ. ముందుగా ఆమె మార్చి 25 న కాకరకాయ వండి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తే దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఆమె రెసిపీలకు ఫిదా అయిన నెటిజన్లు తెగ షేర్స్ చేయడంతో బామ్మకు భీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది. ఈమె ఛానల్ కి 5 లక్షలకు పైగా సబ్స్కిబర్స్ ఉన్నారు. ఇక ఆమె వాడే మసాలాలకు డిమాండ్ పెరగడంతో ఆ వ్యాపారం కూడా మొదలెట్టింది బామ్మ.

తాజాగా ఆమెకి యూట్యూబ్ క్రియేటర్స్ అవార్డుకి ఎంపికయ్యింది. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె ఛానల్ హ్యాక్ గురైంది. దీనితో ఆమె ఖాతా రద్దైంది. అయితే యూట్యూబ్ ఇండియా ఆమెకి సహాయపడింది. దీనితో తిరిగి ఛానెల్‌ లో వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ దూసుకుపోతున్నారు బామ్మ!

Tags

Read MoreRead Less
Next Story