Boyfriend Shoots Girlfriend's Mother: కుక్క మీద కోపాన్ని అత్త మీద తీర్చుకున్నాడు

Boyfriend Shoots Girlfriends Mother: కుక్క మీద కోపాన్ని అత్త మీద తీర్చుకున్నాడు
కుక్క విషయంలో గర్ల్ ఫ్రెండ్ తో గొడవ; కోపంతో ఆమె తల్లిని కాల్చిన బాయ్ ఫ్రెండ్
అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించినట్లు, ప్రియురాలి మీద కోపతో ఆమె తల్లిపై కాల్పులు జరిపాడో ప్రభుద్ధుడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దేశ్ బంధు గుప్తా ప్రాంతం నుంచి స్థానికుల ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన క్రైమ్ సీన్ కు చేరుకుని భుజానికి గాయాలైన మహిళను కనుగొన్నారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించిన వైద్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఇక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మహిళపై కాల్పులు జరిపిన నిందితుడిని అలోక్ గా గుర్తించారు. బాధిత మహిళ కుమార్తెతో సహజీవనం చేస్తోన్న అలోక్ పెంపుడు శునకం విషయంలో ప్రియురాలితో గొడవ పడ్డాడు. ఈ గొడవ కాస్తా ముదరడంతో ఇరువురి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న మహిళ వారిద్దరి మధ్యా రాజీ కుదిర్చేందుకు వారు నివశిస్తోన్న ఫ్లాట్ కు వెళ్లింది. అయితే గొడవ సద్దుమణగకపోగా కోపోద్రిక్తుడైన అలోక్ తన వద్ద ఉన్న గన్ తో మహిళపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. అలోక్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 307 ప్రకాసం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story