Viral Video: మామయ్యలా మజాకా.. మేనకోడలి పెళ్లికి రూ.3 కోట్ల బహుమతులు..

Viral Video: నాన్న దగ్గర సాగని ఆటలు మేన మామ దగ్గర సాగుతాయి. మామయ్యలకి కూడా మేనకోడళ్లు, మేనళ్లులు అంటే అంతే ప్రేమా ఆప్యాయతలతో ఉంటారు. పుట్టింట్లో ఉన్నప్పుడు సోదరీమణులకు ప్రేమను పంచిన సోదరులు వారు అత్తారింటికి వెళ్లినా అదే ప్రేమని కనబరుస్తారు. ఇక వాళ్ల పిల్లలకంటే ఒకింత ఎక్కువగానే ప్రేమని పంచుతారు మేన మామలు.. ఎక్కడైనా ఈ అనుబంధం, ఆత్మీయతలు ఒకలానే ఉంటాయి. ఇటీవల, రాజస్థాన్ జైపూర్‌లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఒక వివాహ సమయంలో, వధువు మామలు కొత్త రికార్డును సృష్టించారు.
ఆచారం ప్రకారం "మైరా" వేడుకను నిర్వహిస్తుండగా, మేనమామల బృందం వధువుకు రూ. 3 కోట్ల విలువైన బహుమతులను అందించింది. వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మార్వాడీలు వివాహ సమయంలో వరుడు లేదా వధువు తల్లితండ్రులు తమ ఆచారాన్ని నిర్వహిస్తారు. వారు తమ మేనల్లుడు లేదా మేనకోడలికి బహుమతులను వివాహానికి ముందే ఇచ్చేస్తారు. దీనినే మైరా అని పిలుస్తారు. ఈ బహుమతులలో రూ. 80 లక్షల నగదు, ఆభరణాలు, ల్యాండ్ పేపర్లు, మరికొన్ని విలువైన వస్తువులు ఉన్నాయి.
ఘేవరీ దేవి, భన్వర్‌లాల్ పొటాలియాల కుమార్తె అనుష్క వివాహం అతిధుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వధువును ఆనందంలో ముంచెత్తడానికి అనూహ్యమైన బహుమతులను తాత భన్వర్‌లాల్ గర్వా తీసుకొని వచ్చారు. గర్వా బుర్డి గ్రామ నివాసి. మనవరాలి వివాహ వేడుక సమయంలో అతనితో పాటు అతని ముగ్గురు కుమారులు హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్ర ఉన్నారు. ఊహించని ఈ పరిణామానికి పెళ్లి కూతురితో పాటు, ఆమె తల్లి దండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే, తన మనవరాలి పట్ల తనకున్న ఉదారత అంతా వధువు తల్లికి దక్కుతుందని గర్వా వెల్లడించారు. ఘేవరీ దేవి వారి కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా ఉందని, ఆర్ధికంగా ఇంత మంచి పొజిషన్‌లో ఉండడానికి ఆమే కారణమని కూతురి గురించి గొప్పగా చెప్పారు గర్వా. అందుకే ఆమెకు తిరిగి ఇవ్వడం మర్యాద అని అతను చెప్పాడు.
फिर मायरा दहेज से अलग कैसे हुआ ? बस देने का तरीका ही अलग दिख रहा है.#Nagaur pic.twitter.com/gzVhmA9onG
— अवधेश पारीक (@Zinda_Avdhesh) March 16, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com