Lucknow: నల్లగా ఉన్నాడు నచ్చలేదు.. పీటల మీద నుంచి లేచి వెళ్లి పోయిన పెళ్లికూతురు

Lucknow: నల్లగా ఉన్నాడు నచ్చలేదు.. పీటల మీద నుంచి లేచి వెళ్లి పోయిన పెళ్లికూతురు
Lucknow: నల్లగా ఉన్నాడు.. నచ్చలేదు.. నాకొద్దీ పెళ్లి అని పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లి పోయింది పెళ్లి కూతురు.. పెళ్లి చూపులప్పుడు తెల్లగా ఉన్న వాడిని చూపించారు..

Lucknow: నల్లగా ఉన్నాడు.. నచ్చలేదు.. నాకొద్దీ పెళ్లి అని పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లి పోయింది పెళ్లి కూతురు.. పెళ్లి చూపులప్పుడు తెల్లగా ఉన్న వాడిని చూపించారు.. ఇప్పుడేమో నల్లగా ఉన్నవాడితో తాళి కట్టిస్తారా.. నాకొద్దీ పెళ్లి అంటూ పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చింది. ఎవరెన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఆఖరికి పోలీసులు కూడా రంగంలోకి దిగి కౌన్సిలింగ్ చేశారు.. అయినా ససేమిరా అంది.

ఒకప్పుడు అబ్బాయికి నచ్చితే చాలు అనుకునే వారు.. కానీ రోజులు మారాయి.. అమ్మాయి నచ్చకపోయినా ఆ పెళ్లి ఆగిపోతుంది.. కలిసి కాపురం చేయాల్సిన వాళ్లిద్దరు ఒకరికి ఒకరు నచ్చాలి.. ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించాలి. అప్పుడే ఆ పెళ్లిళ్లు నిలుస్తాయి. కాలం మారింది అమ్మాయిలు, అబ్బాయిల అభిప్రాయాలు మారుతున్నాయి.. ప్రాధాన్యాలు పెరిగిపోతున్నాయి. లేదంటే ఆ పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటే అవుతుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలోని భర్తనా పట్టణానికి చెందిన యువతి ఫోటోలో చూసిన వ్యక్తి ఇతడు కాదు. అతను చాలా అందంగా ఉన్నాడు.. వీళ్లు నన్ను మోసం చేశారు అని బోరున విలపించింది. అయితే వధువును ఒప్పించేందుకు ఇరు కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా యువతి అతడిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు.

ఈ పంచాయితీ కాస్తా చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి దాదాపు ఆరుగంటలపాటు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి పెళ్లి రద్దు చేశారు. పెళ్లి ఆగిపోవడంతో ఆగ్రహించిన వరుడి కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story