సోదరిపై అన్న ప్రేమ.. పుట్టింటికి తీసుకువెళ్లేందుకు హెలికాప్టర్

కొత్తగా పెళ్లైన చెల్లిని అత్తారింటినుంచి పుట్టింటికి తీసుకురావాలి. కారు, బస్సు, బైకు ఇవన్నీ మామూలే.. ఏదైనా కొత్తగా చేయాలి.. హెలికాప్టర్ అద్దెకు తీసుకుంటే ఎలా ఉంటుందని భావించాడు. చెల్లిని, బావని అందులో తీసుకువస్తే అతడి కళ్లలో ఆనందం చూడొచ్చనుకున్నాడు. అనుకున్నదే తడవుగా హెలికాప్టర్ తీసుకుని ఆ గ్రామంలో ల్యాండ్ అయ్యాడు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాకు చెందిన విరాజ్ కావడియా తన చెల్లి శివాని కావడియాకు పెళ్లి చేశాడు.
పెళ్లి కొడుకు పర్లీలోని వైజ్యనాథ్ ప్రాంతంలో ఉంటున్న జైన్ కుటుంబానికి చెందిన డాక్టర్ కుణాల్ జైన్. కుటుంబ సంప్రదాయం ప్రకారం పెళ్లైన కొద్ది రోజులకు పెళ్లి కూతురును పుట్టింటికి తీసుకురావాలి. దీంతో బావని సర్‌ఫ్రైజ్ చేయాలని భావించి హెలికాప్టర్ అద్దెకు తీసుకుని సోదరి గ్రామానికి వెళ్లాడు. తమ ఊరికి హెలికాప్టర్ వచ్చిందేమిటి.. ఎవరొస్తున్నారో అని గ్రామస్థులంతా చెవులు కొరుక్కున్నారు. ఊరు బయట ఉన్న బారిస్టర్ నికం మైదానంలో ల్యాండ్ చేసిన హెలికాప్టర్‌ని చూడ్డానికి గ్రామం అంతా కదిలింది. జనం సందోహం మధ్య తన సోదరిని, బావని తీసుకుని విరాజ్ వెళ్లాడు. ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com