BRS Office in Delhi: బీఆర్‌ఎస్ కార్యాలయంలో పండుగ వాతావరణం.. ఎస్పీ మార్గ్ గులాబీమయం

BRS Office in Delhi: ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎస్పీ మార్గ్ గులాబీమయంగా మారింది.. ఇప్పటికే భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర నేతలకు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.. కేసీఆర్ కూడా చేరుకున్నారు హోమాలు కొనసాగుతున్నాయి.. హోమ గుండాల దగ్గర ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ కవిత.మధ్యాహ్నం 12.37 నుంచి 12.47 మధ్య ముహూర్తం నిర్ణయించారు..రాజశ్యామల, నవచండీ యాగాలు,పూర్ణాహుతి అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు కేసీఆర్.
ఇప్పటికే ఎస్పీ మార్గ్ చేరుకున్నారు తమిళనాడు,ఒడిసా,పంజాబ్,హర్యానకు చెందిన రైతు నేతలు.బీఆర్‌ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలు, జేడీయూ నేత కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌తో పాటు మరికొందరు నేతలు కూడా కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంది.
పార్టీ జాతీయ విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. నదీ జలాలు, సరిహద్దు వివాదాలు, ఆర్ధిక రంగ పురోభివృధ్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ, విద్యుత్ సంస్కరణలు, విదేశాంగ విధానం, జాతీయ సంస్థల తీరు, సమాఖ్య స్ఫూర్తి, జాతీయ స్థాయిలో పొత్తులు వంటి అంశాలపై కేసీఆర్ తమ విధానాన్ని ప్రకటిస్తారని సమాచారం.
మరోవైపు పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కానున్నారు. ఎన్ని వాహానాలు రానున్నాయన్న విషయాలపై ఆరా తీస్తున్నారు ఢిల్లీ పోలీసులు నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో వీవీఐపీలు ప్రయాణిస్తుంటారు.. ప్రధాని మోదీ కూడా ఇదే రోడ్డులో ప్రయాణిస్తుంటారు.. ఈ నేపధ్యంలో ఈ రోడ్‌లో పటిష్ట బందోబస్తు ఉంటుంది.. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా ముందే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.. ఫ్లెక్సీలకు,బ్యానర్‌లకు అనుమతి లేదంటూ పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీను తొలగించారు ఢిల్లీ మున్సిపల్ అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com