కర్నాటక సీఎం యడియూరప్ప రాజీనామా..!

కర్నాటక సీఎం యడియూరప్ప రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించేందుకు యడియూరప్ప రాజ్‌భవన్‌కు బయల్దేరారు. దీంతో కర్నాటక బీజేపీలో కొంతకాలంగా నడుస్తున్న నాటకీయ పరిణామాలకు పుల్‌స్టాప్ పడినట్లైంది. రాజీనామా సందర్భంగా.. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీన్ని బట్టి కేంద్ర నాయకత్వం నుంచే ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. 75 ఏళ్లు పైబడినప్పటికీ.. తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారని, అందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తాను.. ఈ రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపామని చెప్పుకొచ్చారు. కర్నాటక అభివృద్ధి కోసం చాలా కృషి చేశానన్న యడియూరప్ప.. ఇకపైనా కర్నాటక ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తానన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com