లంచం తీసుకోండి.. కానీ బలవంతం చేయొద్దు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ప్రజలు స్వచ్చందంగా లంచం ఇస్తే తీసుకోండి కానీ బలవంతం చేయొద్దంటూ అధికారాలకి ఓ ఎమ్మెల్యే చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)ఎమ్మెల్యే రాంబాయి సింగ్ ఈ వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దామోహ్ జిల్లా పథారియా నియోజకవర్గం సతావువా గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాంబాయి పాల్గొన్నారు.
అక్కడ ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చినంత తీసుకోవాలి కానీ బలవంతం చేయొద్దు. లంచం విషయంలో అధికారులు పేదలను గుర్తుపెట్టుకోవాలి.. వారిదగ్గర ఉన్నందంతా లాక్కోకూడదని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లంచం తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని దామోహ్ జిల్లా కలెక్టర్ కృష్ణ చైతన్య చెప్పారు. అటు ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాంబాయి సింగ్ సమర్థించుకున్నారు.
నిరుపేదలు ఎంత కష్టపడిన రూ. 6 వేలు కూడా సంపాదించలేరు. అటువంటి వారు ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ రూ.10 వేల చొప్పున బలవంతం చేయకూడదని చెప్పినని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com