Budget 2023 : ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!

2023 - 24 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ధరల పెరుగుదల, తగ్గుదల వేటిపై ఉండనుందో వివరించారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.
ధరలు పెరిగేవి
బంగారు ఆభరణాలు
వెండి
సిగరేట్లు
ఎలక్ట్రిక్ కిచెన్ వస్తువులు
దిగుమతి చేసుకున్న వస్తువులు
ఎలక్ట్రిక్ వాహనాలు
ధరలు తగ్గేవి
మొబైల్ విడిభాగాలు
టీవీ ప్యానల్ విడిభాగాలు
లిథియం అయాన్ బ్యాటరీల యంత్రాలు
EV పరిశ్రమ ముడిపదార్థాలు
కెమెరా లెన్స్ లు
2024లో జరుగనున్న లోక్ సభ ఎన్నికలకు ఈ బడ్జెట్ ప్రాముఖ్యత చాలా ఉంది. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రసంగం అనంతరం, 2022- 23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) వార్షిక బడ్జెట్ ను సిద్ధం చేయడానికి అధికారిక కసరత్తు అక్టోబర్10న ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ( 2023-24లో) భారత జీడీపీ 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగనుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కోవిడ్ మహమ్మారి నుండి భారతదేశం ఆర్థికంగా కోలుకోవడం పూర్తయిందని 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం నుంచి 6.8శాతం వృద్ధి చెందుతుందని సర్వే పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com