Budget 2023 : బడ్జెట్ పై ప్రధాని ప్రశంసలు

2023 కేంద్ర బడ్జెట్, బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తుందని అన్నారు ప్రధాని మోడీ. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ బడ్జెట్ పేదలు, గ్రామస్థులు, రైతులు, మధ్యతరగతి వారి కలలను నెరవేరుస్తుందని అన్నారు. మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించడం, మహిళల సాధికారత కోసం చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
తొలిసారిగా 'విశ్వకర్మ శిక్షణ', సహాయానికి సంబంధించిన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు మోడీ. పీఎం విశ్వకర్మ కౌషల్ సమ్మాన్ ద్వారా ప్రొత్సాహాకాన్ని ప్రకటించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలను మరో ఏడాది పొడగించామని అందుకు రూ.13.7 లక్షల కోట్లను కెటాయించినట్లు చెప్పారు. సీనియర్ సిటిజన్స్ కోసం 'సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం' కింద గరిష్ట పరిమితి రూ.15 లక్షల నుండి రూ.30లక్షల వరకు పెంచడం అభినందనీయమని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com