Budget 2023: అందరి కళ్లూ నిర్మలా సీతారామన్‌ చీరపైనే..

Budget 2023: అందరి కళ్లూ నిర్మలా సీతారామన్‌ చీరపైనే..
X
ఎరుపు రంగు చీరలో తెలుగింటి కోడలు

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఐదోసారి. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున నిర్మలమ్మ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. అయితే ఈ రోజు బడ్జెట్ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు వచ్చిన తెలుగింటి కోడలు ఎరుపు రంగు చీరలో కనిపించారు. బ్రౌన్‌ కలర్ టెంపుల్‌ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీర ధరించారు. 2019లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ఈ రోజ వరకు కూడా చేనేత దుస్తులనే ఆమె ధరిస్తున్నారు. సిల్క్‌, కాటన్ ఏదైనా కానీ ఒడిశా చేనేత చీరలు తనకిష్టమైన వాటిలో ఒకటని తెలిపారు. వాటి రంగు, నేతపని, ఆకృతి బాగుంటాయని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Tags

Next Story