బడ్జెట్ మహత్యం.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

2021-22 బడ్జెట్.. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అనుకూలంగా ఉంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించడం సూచీల సెంటిమెంటును పెంచింది. అవసరమైతే మరింత ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడమన్న నిర్మలమ్మ వాగ్ధానం మదుపర్లలో ఉత్సాహాన్ని పెంచింది. అలాగే ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధిని కేటాయించడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. నూతన తుక్కు విధానంతో ఆటో రంగ షేర్లు కూడా భారీగా లాభపడుతున్నాయి.
బ్యాంకింగ్ రంగ షేర్లు సైతం భారీ లాభాలను ఆర్జించనున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ 9 శాతానికి పైగా లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఆరు శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 11:47 గంటల సమయంల సెన్సెక్స్ 809 పాయింట్లు లాభపడి 47,095 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 215 పాయింట్ల లాభంతో 13,850 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.03 వద్ద కొనసాగుతుడగా, యూపిఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com