పోటీలో గెలిచిన విజేతకు వెరైటీ బహుమతి..

పోటీలో గెలిచిన విజేతకు వెరైటీ బహుమతి..
ఉత్తమ రెజ్లెర్‌కు రూ.1.5 లక్షల విలువ చేసే గేదెను బహుమతిగా ఇస్తామని తెలిపారు.

క్రీడా పోటీల్లో గెలిచిన విజేతకు మెమెంటోతో పాటు నగదు బహుమతిని అందిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈసారి నిర్వహించే రెజ్లింగ్ పోటీలో విజేతలకు గేదెలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించామని ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహీవీర ప్రసాద్ వెల్లడించారు. ఆగ్రాలో జరుగుతున్న నేషనల్ ఉమెన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఉత్త్ క్రీడాకారిణికి పాలిచ్చే గేదెను బహుతిగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఉత్తమ రెజ్లెర్‌కు రూ.1.5 లక్షల విలువ చేసే గేదెను బహుమతిగా ఇస్తామని తెలిపారు. గేదెను ఇవ్వడమేంటని అడిగిన వారికి సమాధానంగా అధికారులు.. అది పాలిచ్చే గేదె కావడం విజేతకు ఉపయోగకరంగా ఉంటుంది. పాల ద్వారా ప్రొటీన్లు అందుతాయి. మరిన్ని పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు సిద్ధమవుతారు అని అధికారులు వెల్లడించారు.

డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఈ ఆలోచన కలిగిందని ప్రసాద్ తెలిపారు. ఒకవేళ విజేత గేదెను వద్దనుకున్నట్లైతే వారికి రూ.1.5 లక్షల నగదును చెల్లిస్తామని తెలిపారు. అయితే ఆటల్లో గెలిచిన వారికి ఇలాంటి అరుదైన బహుమతులు ఇవ్వడం ఇదేమీ తొలిసారి కాదు. గత ఏడాది కశ్మీర్‌లోని కుప్వార్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విజేతకు చేపను అందిచారు.

Tags

Read MoreRead Less
Next Story