మహేష్‌బాబుకు వదినగా..

మహేష్‌బాబుకు వదినగా..
తాజాగా మహేష్ బాబుకి కూడా వదిన అయిపోయారు రేణూ దేశాయ్.

పవన్ కళ్యాణ్ అభిమానులు రేణూదేశాయ్‌ని ప్రేమతో, గౌరవంతో వదిన అని పిలుచుకుంటారు. తాజాగా మహేష్ బాబుకి కూడా వదిన అయిపోయారు రేణూ దేశాయ్. గీత గోవిందం ఫేమ్ పరసురాం దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేష్‌కి రేణూ దేశాయ్ వదినగా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.

మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న ఈ చిత్రం బ్యాంక్ కుభకోణం ఆధారంగా రూపుదిద్దుకోనుంది. బ్యాంకుకు సంబంధించిన ఎపిసోడ్లను చిత్రించేందుకు రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ బ్యాంకు సెట్ ను వేశారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags

Next Story