దేశవ్యాప్తంగా 54 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు..సర్వేలు ఏం చెబుతున్నాయి?

బిహార్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ హవానే కనిపిస్తోందంటున్నాయి సర్వేలు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని 54 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. గుజరాత్‌లో 8, ఉత్తర ప్రదేశ్‌లో 7, కర్నాటకలో రెండు, జార్ఖండ్‌లో 2, ఒడిశాలో 2, నాగాలాండ్‌లో 2, తెలంగాణ ఒక స్థానానికి, హర్యానా, ఛత్తీస్ గఢ్‌లలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 54 స్థానాల్లో బీజేపీకి 16 నుంచి 18 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకోవచ్చని అంచనా వేసింది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ 5 స్థానాలను, ఎస్పీ 1 లేదా 2 సీట్లను, బీఎస్పీ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది. గుజరాత్‌లో బీజేపీ 6 నుంచి 7 సీట్లను, కాంగ్రెస్ ఒక సీటు కైవసం చేసుకోవచ్చని అంచనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com