కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ దసరా కానుక అందించనుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోద్ ముద్ర కూడా లభించింది. 30 లక్షలకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ అందించేందుకు తక్షణం రూ.3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించింది. దసరా లోపు బోనస్ ఉద్యోగుల ఖాతాల్లో నగదు ఒకే వాయిదాలో జమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్టాఫీసులు, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వంటి ప్రభత్వ రంగ సంస్థల్లో పని చేసే 17 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్పాదకతతో సంబంధం లేని బోనస్ ను అందుకోనున్నారు. మరోవైపు దుర్గాపూజ లోగా సామర్ధ్యం ఆధారిత బోనస్ ను విడుదల చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రెండు ప్రధాన రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com